సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆస్కార్‌ బరిలోకి మరో భారతీయ చిత్రం ‘అంగ్‌’

1 గంట క్రితం

movies
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 07:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

2027 ఆస్కార్‌ కోసం భారత్‌ నుంచి నాగాలాండ్‌కు చెందిన ‘అంగ్‌’ కూడా ఆస్కార్‌ పరిశీలనకు అర్హత సాధించింది. తేజ రియో దర్శకత్వం వహించిన ‘అంగ్‌’ 2026 టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రతిష్టాత్మక ‘ప్లాట్‌ఫామ్‌’ అవార్డును గెలుచుకుంది. ఈ విభాగంలో పోటీపడిన 12 చిత్రాల్లో ‘అంగ్‌’ విజేతగా నిలిచింది. ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా 33 చిత్రాలను పరిశీలించి ‘గొంధల్‌’ను అధికారిక భారతీయ ఎంట్రీగా ఎంపిక చేసింది. అయితే 2026 నుంచి అమల్లోకి వచ్చిన ఆస్కార్‌ నిబంధనల ప్రకారం టొరంటో ‘ప్లాట్‌ఫామ్‌’ వంటి నిర్దేశిత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రధాన పురస్కారం గెలుచుకున్న ఆంగ్లేతర చిత్రాలకు ఆస్కార్‌ పరిశీలనకు ప్రత్యేక అర్హత లభిస్తుంది. దీంతో ‘అంగ్‌’కు ఈ అవకాశం దక్కింది. 1960ల నాటి నాగాలాండ్‌ నేపథ్యంలో భారత్‌–మయన్మార్‌ సరిహద్దుకు సమీపంలోని కోన్యాక్‌ తెగ గ్రామంలో జరిగే కథగా ‘అంగ్‌’ రూపొందింది. కోన్యాక్‌ భాషలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఓ తెగ నాయకుడు, అతని కుమారుడి మధ్య సంబంధాన్ని ప్రధానంగా చూపించారు. సంప్రదాయ జీవన విధానంపై ఆధునికత ప్రభావాన్ని కూడా దర్శకుడు ఆవిష్కరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్