దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘అనుమానం పక్షి’. ఈ సినిమా విడుదల తేదీని తెలియజేస్తూ చిత్ర బృందం తాజాగా ఫన్నీగా రూపొందించిన రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రాగ్ మయూర్ కథానాయకుడిగా, మెరిన్ ఫిలిప్ కథానాయికగా నటించారు. ప్రిన్స్ సెసిల్, బ్రహ్మాజీ, అజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, మేఘా చిలక, స్నేహ రాజేష్ జగ్తియాని, విహాన్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదలకు ముందే ఫన్నీ ట్రైలర్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ‘అనుమానం పక్షి’పై ఆసక్తి నెలకొంది.
25న ‘అనుమానం పక్షి’ విడుదల
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 07:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)