‘పొలిమేర 3’లో నటుడు అర్జున్ ‘వీరావి’ పాత్రలో నటిస్తున్నారు. ఆగస్టు 15న అర్జున్ పుట్టినరోజు సందర్భంగా మూవీ మేకర్స్ ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ, ఆయన చెయ్యి మాత్రమే కనిపించేలా పోస్టర్‌ను విడుదల చేశారు. ‘యాక్షన్ కింగ్ అర్జున్ ‘వీరావి’గా ‘పొలిమేర 3’ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. వేట మొదలవుతోంది.. రహస్యం మరింతగా ముదురుతోంది.. ఫస్ట్ లుక్ త్వరలోనే రాబోతోంది!’ అని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి, జాన్వీ నారంగ్ నిర్మిస్తున్నారు.
పొలిమేర 3’లో 'విరావి'గా అర్జున్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 15, 2026, 08:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)