- ఈతకు దిగి కృష్ణా నదిలో మునిగి ముగ్గురు యువకులు మృతి
ప్రజాశక్తి-ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : స్వతంత్ర దినోత్సవం నాడు విజయవాడలో ముగ్గురు తల్లీలకు కడుపుకోత మిగిల్చింది. శనివారం సెలవు కావడంతో మధ్యాహ్నం సీతానగరం పుష్కర్ ఘాట్ లో ఈతకు వచ్చి విజయవాడకి కృష్ణ లంక ఇంద్ర కాలని ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు గల్లంతయ్యి మృతి చెందారు. సమాచారం అందుకున్న కృష్ణాలంక పోలీసులు గల్లంతయిన ముగ్గురు బాలురు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు మృతులు తిగుళ్ల తేజ, గడ్డం జాషువా, వీసాం గౌతం ముగ్గురు యువకుల మృతదేహాలను వెలికితీసి కృష్ణ లంక పోలీసులు మృతదేహలను ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







కామెంట్‌లు (0)