సైనికుల త్యాగాల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది ఇండియన్ బోర్డర్’. ఇందులో ఆదిత్య మీనన్, అజయ్, మురళీమోహన్, కిరణ్ యార్లగడ్డ, ఆదర్శ్ సింధు తులానీ, మేఘ శ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం ఈ చిత్రం నుంచి దేశభక్తిని చాటే ‘జిందా రహేన్ తో డ్యూటీ’ పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. డీఎస్ బాషా రాసిన ఈ పాటకు ఆనంద్ మంత్ర సంగీతం అందించగా, శర్వాణా ఆలపించారు. ఈ సినిమా కథను పాలస్తీనా యుద్ధ సమయంలో రాశానని రచయిత, హీరో కిరణ్ యార్లగడ్డ తెలిపారు. కథకు తుది రూపం ఇస్తున్నప్పుడు సైనికుడు, అతడి భార్య చేసే త్యాగాలను కూడా చూపించాలని దర్శకుడు డీసీ బాషా సూచించారని చెప్పారు. ‘ఈ చిత్రం సైనికుడి త్యాగం, ఆలోచనలు, గొప్పదనాన్ని చాటిచెబుతుంది. అందుకే ఈ పాటను కూడా సైనికుడికి అంకితం చేసేలా చిత్రీకరించాం.’ అని అన్నారు.
‘జిందా రహేన్ తో డ్యూటీ’ పాట విడుదల
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 15, 2026, 08:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)