శుక్రవారం, 14 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

రిషబ్‌‌శెట్టికి అవార్డు ప్రదానం

4 గంటల క్రితం

awards
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 14, 2026, 07:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఆగస్టు 14న 17వ ‘ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌’ అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కన్నడ నటుడు రిషబ్‌ శెట్టి రెండు అవార్డులను అందుకున్నారు. ‘కాంతార: ఏ లెజెండ్‌ - చాప్టర్‌ 1’ చిత్రానికి ఉత్తమ దర్శకుడి అవార్డుతో పాటు ‘లీడర్‌షిప్‌ ఇన్‌ సినిమా’ అవార్డును ఆయన దక్కించుకున్నారు. నటి రేఖను ‘ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ సినిమా’ పురస్కారంతో సత్కరించారు. 30 ఏళ్ల సినీ ప్రస్థానంలో సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసినందుకు నటి రాణి ముఖర్జీకి ‘గౌరవ డాక్టరేట్‌ ఆఫ్‌ లెటర్స్‌’ ప్రదానం చేశారు. ఉత్తమ నటీనటులుగా దుల్కర్‌ సల్మాన్‌, కీర్తి కుల్హరి, విజయ్‌ వర్మ, రసికా దుగల్‌ అవార్డులు అందుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్