శుక్రవారం, 09 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నానా పటేకర్ మృతిపై కేసు నమోదు

1 గంట క్రితం

case
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 10:32 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- దర్యాప్తు ప్రారంభం

పనాజీ: ప్రముఖ చిత్రనిర్మాత, సామాజిక కార్యకర్త నానా పటేకర్ మృతిపై గోవా పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. ఈ కేసు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 194 కింద నమోదైంది. కుటుంబ సభ్యులు, సహాయకుల వాంగ్మూలాలను నమోదు చేయనున్నారు. నానా పటేకర్ (75) గురువారం ఉదయం గోవాలోని డోనపోలోలో ఉన్న తన నివాసంలో విగతజీవిగా కనిపించారు. ప్రాథమిక పరిశీలనలో ఆయన గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం ఇది సహజ మరణమే. మరణంలో ఎలాంటి అసాధారణత లేదని ఆసుపత్రి అధికారులు కూడా తెలిపారు. సాధారణ ప్రక్రియలో భాగంగానే ఈ కేసు నమోదు చేసినట్లు తెలిసింది. గురువారం రాత్రి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్