శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'కరికాల`లో కేథరిన్

1 గంట క్రితం

'కరికాల`లో కేథరిన్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 08:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘కరికాల’లో ప్రముఖ నటి కేథరిన్‌ థ్రెసా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఆమె పాత్రకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ‘కరికాల అద్భుత ప్రపంచంలోకి కేథరిన్‌ థ్రెసాకు స్వాగతం. ఓ కొత్త సౌందర్యం, రహస్యం.. అద్భుతమైన అధ్యాయం’ అంటూ పోస్టర్‌ను పంచుకుంది. ‘శంబాల’ చిత్ర దర్శకుడు యుగంధర్‌ ఈ సినిమాను షైనింగ్‌ పిక్చర్స్‌ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘కరికాల చాప్టర్‌ 1’ వచ్చే ఏడాది జూలై 2న, రెండో భాగం అక్టోబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్