శనివారం, 03 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నవ్వుల హంగామాతో 'చంద్రయాన్'

9 గంటల క్రితం

నవ్వుల హంగామాతో 'చంద్రయాన్' image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 06:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

దర్శకుడు, రచయిత శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వంలో శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని జంటగా నటించిన చిత్రం 'చంద్రయాన్'. రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ కీలక పాత్రలు పోషించారు. సింబ స్క్రీన్ స్టోరీస్ పతాకంపై ప్రవీణ్ మొలక నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో చిత్ర గ్లింప్స్‌ను విడుదల చేశారు. 'ఎక్కాలు రాకుండా రాకెట్‌కు కావాల్సిన లెక్కలు ఎలా..' అంటూ సాగిన ఈ గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనాథ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. 'మందమర్రి టు చందమామ.. ఆగేది కాదు ఇది ఫుల్ హంగామా. ఈ సినిమా 2 గంటల 15 నిమిషాల పాటు ప్రేక్షకులను నవ్విస్తుంది. ఇందులోని పాత్రలు అమాయకంగానే కనిపించినా చాలా ధైర్యవంతులు. అలాంటి వ్యక్తులు రాకెట్ ఎలా తయారు చేశారు? అంతరిక్షంలోకి ఎలా వెళ్లారు? అన్నదే కథ' అని వివరించారు. ఈ సినిమాతో నటిగా మారాలన్న తన కల నెరవేరిందని కథానాయిక స్వప్న ప్రియదర్శిని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్