బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

24న ‘చెన్నై లవ్ స్టోరీ’ విడుదల

19 జులై, 2026

love
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 10:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- విశాఖలో సందడి చేసిన చిత్ర యూనిట్

ప్రజాశక్తి - ఎంవిపి కాలనీ : యువ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రం ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం విశాఖలోని ఒక హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని సినిమా విశేషాలను వెల్లడించింది. ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, ‘చెన్నై లవ్ స్టోరీ’ తన కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైన చిత్రమని అన్నారు. ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు చూడని వైవిధ్యమైన కథతో ఈ సినిమా రూపొందిందని, కథా కంటెంట్‌పై చిత్ర బృందానికి పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. ‘బేబీ’ చిత్రానికి కథ అందించిన సాయి రాజేష్ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించగా, దర్శకుడు రవి నంబూరి కథను ఆకట్టుకునేలా తెరకెక్కించారని చెప్పారు. ప్రేక్షకుల ఆదరణతో ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ మాట్లాడుతూ, విశాఖపట్నం తనకు ఎంతో ఇష్టమైన నగరమని, ఇక్కడ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ‘చెన్నై లవ్ స్టోరీ’ తన సినీ ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని, ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటాయని తెలిపారు. రవి నంబూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రేమకథకు కొత్తదనాన్ని జోడిస్తూ రూపొందిన ఈ చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్