‘చుట్టమల్లే’ పాటను ఉపయోగించి ఏఐతో అసభ్యకరమైన మార్ఫింగ్ వీడియోలు సృష్టించడంపై మెగాస్టార్ చిరంజీవి తీవ్రంగా స్పందించారు. ఇలాంటి చర్యలు క్రూరమైనవి, సిగ్గుచేటైనవని ఖండించారు. బాధితులకు అండగా నిలిచేందుకు సినీ పరిశ్రమ తరఫున ప్రత్యేక కమిటీ, సపోర్ట్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు.
ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి వీడియోలను చూడటం, డౌన్‌లోడ్ చేయడం, షేర్ చేయకుండా సంబంధిత ప్లాట్‌ఫామ్‌లు, సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.







కామెంట్‌లు (0)