ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రైతు బజార్లలో రూ.35కే కిలో ఉల్లి

45 నిమిషాల క్రితం

manohar.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 10:40 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్

ప్రజాశక్తి – తెనాలి (గుంటూరు జిల్లా): బహిరంగ మార్కెట్లో పెరిగిన ఉల్లి ధరల నుంచి సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు రైతు బజార్ల ద్వారా రాయితీ ధరకు ఉల్లిపాయలు అందిస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆదివారం తెనాలిలోని రత్నా టాకీస్‌ కూడలిలో ఉన్న రైతు బజార్లో ఏర్పాటు చేసిన ఉల్లిపాయల విక్రయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ప్రజలకు కిలో రూ.35కే ఉల్లిపాయలు అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 115 రైతు బజార్లలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతిరోజూ సుమారు 150 మెట్రిక్‌ టన్నుల ఉల్లిపాయలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి చెప్పారు. రాబోయే రోజుల్లో మొబైల్‌ కౌంటర్లు, మినీ లారీల ద్వారా కూడా ప్రజలకు రాయితీ ధరకు ఉల్లిపాయలు అందించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ కోమలి పద్మ, మార్కెటింగ్‌ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కె.శ్రీనివాసరావు, పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్