ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్‌ మహిళ మృతి

47 నిమిషాల క్రితం

road acident.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 10:36 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన మహిళ దుర్మరణం చెందారు. మిస్సోరిలో ఉద్యోగం చేస్తున్న దారం సుప్రియ (31) ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ట్రక్‌ ఢీకొనడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండల కేంద్రానికి చెందిన సుప్రియ వివాహిత. ఉద్యోగరీత్యా కొంతకాలంగా అమెరికాలోని మిస్సోరిలో నివాసం ఉంటున్నారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆమె ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఓ ట్రక్‌ బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో సుప్రియ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. అదే కారులో ప్రయాణిస్తున్న భారత్‌కు చెందిన మరో యువతికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సుప్రియ మృతితో మరిపెడలోని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్