హీరో శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. ఈ చిత్రం అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ‘ఈ కామ్రేడ్ వచ్చేది విప్లవం కోసం కాదు.. థియేటర్లలో నవ్వుల విప్లవం సృష్టించడానికి’ అంటూ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. 1990ల నాటి వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని మాడుగుల నేపథ్యంలో ఈ పీరియాడిక్ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. శ్రీవిష్ణు ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తున్నారు. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు.
అక్టోబర్ 9న కామ్రేడ్ కళ్యాణ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 15, 2026, 07:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)