శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కొత్త పోస్టర్లు విడుదల

1 గంట క్రితం

ranabali
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 07:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రభాస్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ నుంచి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘స్వేచ్ఛ ఒక వేడుకగా మారకముందు అదొక యుద్ధం. మన రేపటి కోసం పోరాటం చేసిన ప్రతి ఫౌజీకి సెల్యూట్‌’ అంటూ పేర్కొంది. ఈ చిత్రం డిసెంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే సందర్భంగా విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న ‘రణబాలి’ నుంచి కూడా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. హీరో ఆది సాయికుమార్‌, భాంధవి శ్రీ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైరాబాను’. సిరికి ఫణి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ‘కొన్ని హృదయాలు కలవడానికే పుడతాయి.. కొన్ని కథలు చెప్పడానికే ఉంటాయి. ప్రేమ అన్ని సరిహద్దులను దాటి విస్తరించాలి. వినోదానికి పూర్తి భరోసా.. మిమ్మల్ని అలరించడానికి ‘సైరాబాను’ వచ్చేస్తోంది!’ అంటూ క్యాప్షన్‌ జత చేశారు. హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్‌ దండా, కృష్ణకాంత్‌ పరుచూరి నిర్మిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్