నటి సమంత ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్’ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా శనివారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రోమోను ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసింది. బనిజయ్ ఏషియా నిర్మిస్తున్న ఈ షో ప్రసార తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఇందులో తమిళ సినీ, టీవీ ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ షో గురించి సమంత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ఇప్పటివరకు నేను ఇలాంటి షో చేయలేదు. అందుకే దీనికి ఓకే చెప్పా. ఈ షో ద్వారా సెలబ్రిటీల మరో కోణాన్ని చూడొచ్చు. వాళ్లు చేసే తప్పులు, సర్‌ప్రైజ్‌లు ఆసక్తికరంగా ఉంటాయి” అని అన్నారు.
కుకింగ్ షోకి హోస్ట్‌గా సమంత
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 15, 2026, 07:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)