బుధవారం, 07 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

23న ‘డెలివరీ బాయ్‌’

1 గంట క్రితం

23న ‘డెలివరీ బాయ్‌’ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 08:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రాధిక శరత్‌కుమార్‌, లియో శివకుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘డెలివరీ బాయ్‌’ అక్టోబర్‌ 23న విడుదల కానుంది. ఈ విషయాన్ని ‘సరిగమ తమిళ్‌’ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. నాని డార్లా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భావోద్వేగాలతో కూడిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. తల్లిని రక్షించేందుకు దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ డెలివరీ బాయ్‌ చేసే పోరాటం నేపథ్యంలో కథ సాగుతుందని దర్శకుడు తెలిపారు. దుష్యంత్‌, కాళీ వెంకట్‌, బోస్‌ వెంకట్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అశాసి క్రియేషన్స్‌ పతాకంపై అముత లియోనీ నిర్మించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్