బుధవారం, 07 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఫారెక్స్‌ నిల్వలు 50 బిలియన్‌ డాలర్లు ఆవిరి..

1 గంట క్రితం

ఫారెక్స్‌ నిల్వలు 50 బిలియన్‌ డాలర్లు ఆవిరి.. 
నాలుగు వారాలుగా పతనం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 08:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • నాలుగు వారాలుగా పతనం

ముంబయి : భారతదేశ విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు వరుసగా నాలుగో వారమూ క్షీణించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌‌బిఐ) నివేదిక ప్రకారం.. దేశ ఫారెక్స్ నిల్వలు 734.6 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ​గత సెప్టెంబర్ 4న నమోదైన గరిష్ట స్థాయి 785.71 బిలియన్ డాలర్లతో పోలిస్తే.. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఈ నిల్వలు సుమారు 50 బిలియన్ డాలర్లు తగ్గాయి. రూపాయి మారకం విలువ పతనాన్ని అరికట్టేందుకు ఆర్‌‌బిఐ స్పాట్ మార్కెట్లో డాలర్లను విక్రయించడం ఈ నిల్వలు తగ్గడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలు, అమెరికా ట్రెజరీ బాండ్ల రాబడులు పెరగడం, విదేశీ ఈక్విటీల ఉపసంహరణ ఒత్తిళ్ల కారణంగా రూపాయి విలువ క్షీణిస్తోంది. బుధవారం ఒక్కసారిగా రూపాయి విలువ దాదాపు 0.5 శాతం పతనమై డాలర్‌కు 96.8450 స్థాయికి చేరుకుంది. ఇది ఆల్ టైమ్ కనిష్ట స్థాయి అయిన 96.96కు అత్యంత సమీపంలో ఉంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్