బుధవారం, 07 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅనర్హుల పేర్లు తొలగింపు

1 గంట క్రితం

vivek
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 08:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లను తొలగించేలా చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)-2026లో భాగంగా జూన్ 15 నుంచి జులై 24 వరకు బూత్ లెవల్ అధికారులు (బిఎల్‌ఒ) ఇంటింటి సర్వే నిర్వహించారని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరణం, శాశ్వత వలస, నకిలీ ఓట్లు, ఆచూకీ లభించకపోవడం తదితర కారణాలతో 44,89,512 మంది ఓటర్లు తమ చిరునామాల్లో లేరని గుర్తించామన్నారు. జులై 31న 3,71,38,182 మంది ఓటర్లతో ముసాయిదా జాబితా ప్రచురించామని పేర్కొన్నారు. అనంతరం చేపట్టిన నోటీసుల ప్రక్రియలో ఈ నెల 6 నాటికి మరో 1,73,071 మంది అనర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. తుది ఓటర్ల జాబితాను ఈ నెల 16న ప్రచురించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 8 నుంచి బిఎల్‌ఒలు 46,62,583 మంది తొలగించిన ఓటర్ల వివరాలతో ఇంటింటికీ వెళ్లి రీ-వెరిఫికేషన్ నిర్వహించనున్నారని పేర్కొన్నారు. పొరపాటున ఓటరు పేరు తొలగించినట్లు నిర్ధారణ అయితే, సంబంధిత వ్యక్తితో ఫారం-6 నింపించి నిరంతర సవరణ ప్రక్రియలో తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చుతామని తెలిపారు. తుది జాబితా ఈ నెల 16న ప్రచురించినప్పటికీ, జనవరి 1, ఏప్రిల్ 1, జులై 1, అక్టోబరు 1 నాలుగు అర్హత తేదీల ఆధారంగా అర్హత పొందిన వారు ఎప్పుడైనా ఫారం-6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు.

​

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్