ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అవినీతి నిరోధక శాఖలో ఉద్యోగ విరమణ చేసిన న్యాయ సలహాదారులు, ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదులు కెవి శ్రీనివాసరావు, పి శేషయ్య సేవలను కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కెవి శ్రీనివాసరావును గుంటూరు, విజయవాడ అవినీతి నిరోధక శాఖ కార్యాలయంలో న్యాయ సలహాదారు, ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా ఒప్పంద ప్రాతిపదికన ఏడాది కాలానికి పునర్నియమించింది. ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి ఏడాది పాటు ఈ పునర్నియామకం అమల్లో ఉంటుంది. పి శేషయ్యను విజయవాడ అవినీతి నిరోధకశాఖ కార్యాలయంలో న్యాయ సలహాదారు, ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా ఏడాది పాటు కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతించింది. 2026 ఆగస్టు 20 నుంచి ఆయన సేవల పొడిగింపు అమల్లోకి వచ్చింది. ఈ నియామకాల వల్ల సంబంధిత కింది స్థాయి వర్గాల ఉద్యోగోన్నతి మార్గానికి ఎలాంటి ఆటంకం కలగకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్థికశాఖ సూచించిన నిబంధనలు, 2018 ఏప్రిల్ 23న జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 48లోని నిబంధనలను అనుసరించి తదుపరి చర్యలు తీసుకోవాలని అవినీతి నిరోధకశాఖ డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించింది.







కామెంట్‌లు (0)