ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేడు భీమవరంలో ‘గోదావరి సాహితీ ఉత్సవం’

16 గంటల క్రితం

godavari.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026, 09:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-భీమవరం (పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్‌‌కెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం జరిగే ‘గోదావరి సాహితీ ఉత్సవం’ కార్యక్రమానికి ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ మేరకు ఉత్సవం అధ్యక్ష కార్యదర్శులు కుమార్ కూనపరాజు, పి.శ్రీనివాసరాజు శనివారం ప్రకటన విడుదల చేశారు. గోదావరి సాంస్కృతిక వేదిక ఆధ్వర్యాన నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కథ, నవల, కవిత, గేయం అనే నాలుగు ప్రక్రియలు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రముఖ కవులు, రచయితల ఉపన్యాసాలు, కొత్త కవులు, కథకులు, గేయ రచయితలతో సంభాషణ, ఇష్టాగోష్టులు ఉంటాయని తెలిపారు. ‘గోదావరి అలలు’ పుస్తకావిష్కరణ ఉంటుందని పేర్కొన్నారు. రచయిత, సినీ దర్శకులు వంశీ, డాక్టర్‌ ఎస్.బాలకృష్ణంరాజు, సాహితీ ప్రియులు మాజీ చైర్మన్‌, కేంద్ర కాంట్రాక్టు లేబర్ బోర్డు, న్యూఢిల్లీకి చెందిన డాక్టర్ ఎస్.బాలకృష్ణంరాజు, ప్రముఖు కవి డాక్టర్‌ ప్రసాదమూర్తి, సామాజికవేత్త మంతెన సీతారామ్ పుస్తకావిష్కరణ చేయనున్నారని తెలిపారు. తెలుగు నవల పరిచయ కార్యక్రమానికి వడ్రేపు వీర లక్ష్మీదేవి, తెలుగు కథ పరిచయం కార్యక్రమానికి రచయిత్రి కుప్పిలి పద్మ అధ్యక్షత వహించనున్నారని పేర్కొన్నారు. కొత్త కథకులతో సంభాషణ కార్యక్రమానికి రచయిత్రి స్వర్ణకిలారి అధ్యక్షత వహించనున్నట్లు తెలిపారు. ‘తెలుగు కవిత్వం’ కార్యక్రమానికి కవి డాక్టర్ ప్రసాద్ మూర్తి అధ్యక్షత వహించనున్నారని, అతిథులుగా కవులు శిఖామణి, కవి బి.వి.వి.ప్రసాద్, కవయిత్రి మెర్సీ మార్గరేట్ హాజరుకానున్నారు. కొత్త కవులతో సంభాషణ కార్యక్రమానికి కవి అనిల్ డ్యాని అధ్యక్షత వహిస్తారని, అతిథులుగా రచయిత్రి శాంతిశ్రీ, రచయిత పొత్తూరి సీతారామరాజు, కవి శేషు కొరపాటి, కవి మెట్టా నాగేశ్వరరావు హాజరుకానున్నారని తెలిపారు. వల్లంకి రాగం, పాటలు ప్రజాగీతాలు కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్టు తాడి ప్రకాష్ అధ్యక్షత వహించనున్నారు. ప్రజా సంస్కృతిని పోత్సహించటానికి, పెంపొందించటానికి జరిగే ఈ ఉత్సవంలో సాహిత్యాభిమానులు, కళాభిమానులు యువరచయితలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్