శనివారం, 01 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

డ్యాన్స్‌ ప్రాక్టీస్‌లో రష్మికకు గాయం

1 రోజు క్రితం

rashmika
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 07:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రముఖ నటి రష్మిక మందన్న గాయపడ్డారు. ఆమె నటిస్తున్న ఓ సినిమా కోసం డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా శరీరంపై తీవ్ర ఒత్తిడి పడటంతో తుంటి భాగంలో గాయమైనట్లు సమాచారం. ఇలాంటి గాయాలు సాధారణంగా అధిక శారీరక శ్రమ చేసే క్రీడాకారుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ప్రస్తుతం రష్మిక వరుసగా రెండు, మూడు చిత్రాల షూటింగ్‌లలో పాల్గొంటుండటంతో శారీరక ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. డ్యాన్స్‌ రిహార్సల్స్‌ సందర్భంగా నొప్పితో బాధపడిన ఆమెను చిత్రబృందం వెంటనే ఆసుపత్రికి తరలించింది. వైద్య పరీక్షల అనంతరం తుంటికి గాయమైనట్లు నిర్ధారించిన వైద్యులు పూర్తిగా కోలుకోవడానికి ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. దీంతో రష్మిక నటిస్తున్న పలు క్రేజీ ప్రాజెక్టుల చిత్రీకరణ తాత్కాలికంగా వాయిదా పడింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్