నయనతార, కవిన్ జంటగా నటించిన ‘హాయ్’ చిత్రం ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. విష్ణు ఎడవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విఘ్నేశ్ శివన్ నిర్మిస్తున్నారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా నయనతార మాట్లాడుతూ, ‘హాయ్’ ఒక క్యూట్, స్వీట్ లవ్‌స్టోరీ అని, తన కెరీర్‌లో విజయవంతమైన ‘యారడి నీ మోహిని’ తరహా అనుభూతిని అందిస్తుందని చెప్పారు. అయితే ఆ చిత్రంలో ఉమ్మడి కుటుంబం ఉంటే, ‘హాయ్’లో చిన్న కుటుంబం ఉంటుందని, కుటుంబ బంధాలు, ప్రేమ, వినోదం ఇందులో ప్రధానంగా ఉంటాయని తెలిపారు. ప్రేమ, పెళ్లి చూపుల్లో వరుసగా తిరస్కరణకు గురయ్యే యువకుడికి, సమాజపు పాత ఆలోచనలను పట్టించుకోని స్వతంత్ర భావాలున్న యువతికి అనుకోకుండా పెళ్లి జరగడం, ఆ తర్వాత వారి మధ్య ప్రేమ చిగురించడం కథాంశమని నయనతార వెల్లడించారు.
‘హాయ్’ ఒక క్యూట్ లవ్‌స్టోరీ!
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 22, 2026, 07:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)