శనివారం, 22 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫార్మా రంగంలో జీరో ఫైర్ లక్ష్యం

1 గంట క్రితం

pharma
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 22, 2026, 08:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ‘ఫెసా 2026’ సదస్సులో నిపుణుల పిలుపు

ప్రజాశక్తి - హైదరాబాద్‌ : ఫార్మా రంగంలో ప్రమాదాల తర్వాత స్పందించడం కంటే ముందస్తు నివారణ, నిరంతర భద్రత అత్యంత కీలకమని వక్తలు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని జీడిమెట్ల ఇండస్ట్రీస్ అసోసియేషన్‌లో శుక్రవారం జరిగిన ‘ఫెసా 2026’ సదస్సులో ఫైర్ అండ్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఏఐ) హైదరాబాద్ చాప్టర్, కౌన్సిల్ ఆఫ్ ఈహెచ్ఎస్ ప్రొఫెషనల్స్ (సీఈపీ) సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సులో తెలంగాణ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జి.వి. నారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్రం అంతర్జాతీయ వ్యాక్సిన్, బల్క్ డ్రగ్ హబ్‌గా ఎదుగుతున్న తరుణంలో కఠినమైన నిబంధనలతో కూడిన ‘జీరో-యాక్సిడెంట్’ విధానం అవసరమన్నారు. ఎఫ్‌ఎస్‌ఏఐ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు మనోజ్ వాహి మాట్లాడుతూ.. గడిచిన పదేళ్లలో ఫార్మా యూనిట్లలో సంభవించిన 102 భారీ అగ్నిప్రమాదాల వల్ల రూ.100 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని, గత ఏడాది సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్‌లో జరిగిన ప్రమాదంలో 46 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికరమని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో పరిశ్రమలు కేవలం మరణాలు లేకపోవడమే కాకుండా ‘జీరో ఫైర్’ (అగ్ని ప్రమాదాలే జరగకపోవడం) లక్ష్యంగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఫ్యాక్టరీల విభాగం డైరెక్టర్ వై. మోహన్ బాబు, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈవో సర్వేష్ సింగ్, సీఈపీ అధ్యక్షుడు తపస్ సాహా తదితరులు మాట్లాడుతూ.. సాంప్రదాయ ఫైర్ డ్రిల్స్‌కు పరిమితం కాకుండా ఏఐ, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, ఆటోమేటెడ్ వ్యవస్థల వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగిస్తూ ప్లాంట్ డిజైన్ దశ నుంచే పటిష్టమైన భద్రతా చర్యలు అమలు చేయాలని సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్