భిన్నమైన పాత్రల్లో నటించడమే తనకు ఇష్టమని అన్నారు బాలీవుడ్ నటి కియారా అద్వానీ. ప్రస్తుతం యశ్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాక్సిక్ చిత్రంలో ఆమె 'నదియా' పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన పోస్టర్లు, 'తబాహీ' పాటపై విమర్శలు రావడంతో పాటు, పెళ్లి తర్వాత ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ పాత్రను ఎందుకు అంగీకరించారో కియారా తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు. "గీతూ మోహన్‌దాస్ కథ చెప్పినప్పుడే ఈ పాత్ర చేయాలని నిర్ణయించుకున్నాను. ఒకే పాత్రలో బలం, బలహీనత, పిచ్చి, సున్నితత్వం వంటి విభిన్న భావాలను ఆవిష్కరించే అవకాశం దక్కింది. ఇలాంటి క్లిష్టమైన పాత్ర చేయడం ప్రతి నటికీ ఓ కల. మహిళలను ఒకే తరహా పాత్రల్లో బంధించి చూపించడం నాకిష్టం ఉండదు. అందుకే ఈ సినిమాకు వెంటనే ఓకే చెప్పాను" అని అన్నారు. ఈ చిత్రంలో నయనతార, హుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ తదితరులతో కలిసి నటించడం సరికొత్త అనుభూతినిచ్చిందని చెప్పారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
భిన్నమైన పాత్రలు ఇష్టం
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 31, 2026, 07:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)