తను నటించిన సినిమాలను తానెప్పుడూ తెరపై చూసుకోలేదని నటి ప్రీతి జింటా షాకింగ్ విషయం చెప్పారు. తాజాగా ఆమె 'వైబ్` మూవీలో స్పై పాత్రలో నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 18న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను నటించిన సినిమాల్ని నెనెప్పడూ తెరపై చూసుకోలేదు. ఎందుకంటే సినిమాల్లో నా నాటనను చూసి ఆ పాత్రకు నేను న్యాయం చేశానా? సరిగ్గా నటించానా? లేదా అని ఎప్పుడూ సంశయిస్తుంటాను. నా నటనకు సంబంధించిన విశ్లేషణను నేను సరిగ్గా అంచనా చేసుకోలేను. అలాంటప్పుడు నేను నా సినిమాల్ని చూడకుండా ఉంటే మంచిదనుకున్నాను. చూస్తే సరిగ్గా నటించలేదనే ఆలోచనలు వెంటాడుతాయి. ఆ ప్రభావం నా తర్వాత సినిమాలపై కూడా పడుతుంది. ఆ విషయాన్ని ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేకుండా నా సినిమాల్ని చూడలేదు` అని ఆమె అన్నారు.
నా సినిమాలను నేనెప్పుడూ చూసుకోలేదు : ప్రీతి జింటా
13 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 07:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)