‘మండాడి’ సినిమా కోసం దాదాపు 70 రోజుల పాటు సముద్రంలోనే షూటింగ్ చేశామని, ఈ క్రమంలో అనేకసార్లు చావు అంచుల దాకా వెళ్లి ప్రాణాలతో బయటపడ్డానని యంగ్ హీరో సుహాస్ తెలిపారు. సెప్టెంబర్ 10న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన చిత్ర విశేషాలను పంచుకున్నారు. ప్రతిరోజూ ఉదయాన్నే ఒడ్డు నుంచి 10 నుంచి 15 కిలోమీటర్ల లోపలికి వెళ్లి సాయంత్రం వరకు అలల మధ్యలోనే షూటింగ్ చేశామని, వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. ‘మండాడి’తో తాను తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నానని సుహాస్ తెలిపారు. ఈ సినిమాలో సీరియస్‌గా భయపెట్టే విలన్ పాత్రలో కనిపించనున్నట్లు చెప్పారు. రామేశ్వరంలోని రామనాథపురం గ్రామం నేపథ్యంలో బోటు రేసింగ్ కాన్సెప్ట్‌తో కథ సాగుతుందని, రేసులో ముందుండే కెప్టెన్‌ను ‘మండాడి’ అంటారని, అందుకే సినిమాకు ఆ టైటిల్ పెట్టినట్లు వివరించారు. కోలీవుడ్ హీరో సూరితో కలిసి సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో సత్యరాజ్, మహిమా నంబియార్ కీలక పాత్రలు పోషించారు.
చావు అంచుల దాకా వెళ్లా: సుహాస్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 08:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)