ప్రజాశక్తి-గోకవరం : పేద ప్రజలుకు పంచాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తున్న రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వివరాల ప్రకారం గోకవరం మండలం గాదేలపాలెం గ్రామంలో ఎర్రంశెట్టి రామారావు కు చెందిన రైస్ మిల్లుపై విజిలెన్స్ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ అధికారులకు అందిన సమాచారం మేరకే ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 60 బస్తాల్లో ఉన్న సుమారు రెండున్నర టన్నుల పైగా ఉన్న రేషన్ బియ్యాన్ని అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఈ బియ్యం విలువ సుమారు 1లక్ష 40 వేలు పైగా ఉంటుందని అధికారులు గుర్తించారు.మారుమూల గ్రామమైన గాదేలపాలెంలో రైస్ మిల్లు ఏర్పాటు చేసి గుట్టుచప్పుడు కాకుండా రేషన్ బియ్యం రవాణా చేస్తున్నట్లు తెలిపారు. గోకవరం మండలంలో ఉన్న రైస్ మిల్లులలో ఎక్కువగా రేషన్ బియ్యం రవాణా దందా కొనసాగుతుందని వాటిపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ అధికారులు, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
రైస్ మిల్లు పై విజిలెన్స్ అధికారులు తనిఖీలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 08:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)