'ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'కళ్యాణం కమనీయం జీవితం'. రవి లోకిరెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు రవి లోకిరెడ్డి మాట్లాడుతూ.. "ఈ సినిమా వెనుక నా ఎన్నో ఏళ్ల కష్టం ఉంది. నా నిజ జీవితంలోని కొన్ని సంఘటనలకు కల్పిత అంశాలను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. ఇది అందమైన ప్రేమకథా చిత్రం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది" అని అన్నారు.
'కళ్యాణం కమనీయం జీవితం' టీజర్
17 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 17, 2026, 07:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)