శనివారం, 25 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అర్థవంతమైన పాత్రలకే ప్రాధాన్యం

6 గంటల క్రితం

news
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 25, 2026, 07:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఇకపై అర్థవంతమైన, పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే నటిస్తానని ప్రముఖ హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘కథానాయికగా కనిపించడం కోసమే కాదు.. పాత్రకు విలువ ఉన్న సినిమాలనే ఎంపిక చేసుకుంటాను. అలాంటి అవకాశాలు దక్కాలంటే తమిళ చిత్రపరిశ్రమ సరైన వేదికగా భావిస్తున్నాను. ఇండస్ట్రీలో నాకు ఎలాంటి గాడ్‌ఫాదర్‌, గాడ్‌మదర్‌ లేరు. అందుకే కెరీర్‌ ప్రారంభంలో నా వద్దకు వచ్చిన కథల్లో నచ్చినవాటినే ఎంచుకుని నటించాను. ఇకపై పాత్రల ఎంపికలో మరింత శ్రద్ధ వహిస్తాను. ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నాను. తమిళంలోనూ నటించే అవకాశం ఉంది’’ అని చెప్పారు. ప్రస్తుతం ఆమె తెలుగులో 'మిరాయ్‌ పార్ట్‌–2', హిందీలో 'ది ఇన్‌ఫ్లుయెన్సర్‌' చిత్రాల్లో నటిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్