శుక్రవారం, 25 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విమర్శలపై స్పందించిన నాని

6 గంటల క్రితం

విమర్శలపై స్పందించిన నాని image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 08:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‘ది ప్యారడైజ్‌’లో హింస ఎక్కువగా ఉందంటూ సోషల్‌ మీడియాలో, సినీ సమీక్షల్లో వస్తున్న విమర్శలపై హీరో నాని స్పందించారు. సినిమా గురించి ప్రేక్షకులు, సినీ విమర్శకులు చేసిన వ్యాఖ్యలను చూశానని ఆయన తెలిపారు. ‘ది ప్యారడైజ్‌’ను ప్రేక్షకులు తమ సినిమాగా స్వీకరించిన తీరు తనను ఆనందపరిచిందని నాని పేర్కొన్నారు. అదే సమయంలో విమర్శకులు, రివ్యూవర్లు ఎత్తిచూపిన పొరపాట్లు, లోటుపాట్లను పరిగణనలోకి తీసుకుంటానన్నారు. ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే సినిమాను రూపొందించామని, దాన్ని ఆస్వాదించడమో, విమర్శించడమో ప్రేక్షకుల ఇష్టమని చెప్పారు. సినిమాపై చూపించిన ఉత్సాహం, తనపై కురిపించిన ప్రేమ, ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్