హీరో నరేష్, సరభి జంటగా నటిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో టీజర్‌ను ఆగస్టు 10న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. ‘అల్లరి నరేష్ తనదైన శైలిలో నవ్వుల విందును తిరిగి తీసుకువస్తున్నారు. ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ ఆగస్టు 10న విడుదల కానుంది. అల్లరోడి మార్కు కామెడీ కోసం సిద్ధంగా ఉండండి’ అంటూ మేకర్స్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, మురళీధర్‌గౌడ్ కీలక పాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు.
10న నరేష్ సినిమా టీజర్
14 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 08, 2026, 07:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)