కోలీవుడ్ నటుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సీన్’. ఇందులో మలయాళ నటి నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. తాజాగా దుబాయ్‌లో జరిగిన సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న నజ్రియా మాట్లాడుతూ.. 12 ఏళ్ల తర్వాత తమిళ చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని చెప్పారు. తనపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపారు. సూర్య అద్భుతమైన వ్యక్తి అని, ఆయనతో కలిసి నటించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సినిమాల పట్ల ఆయన చూపించే నిబద్ధత, మంచి కథలను ఎంచుకునే విధానం తమకు స్ఫూర్తినిస్తాయని అన్నారు. జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై జ్యోతిక, సూర్య నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 6న విడుదల కానుంది.
సూర్యకు జోడీగా నజ్రియా నజీమ్
20 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 26, 2026, 06:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)