"నా నటన నచ్చితే అవకాశాలు వాటంతట అవే వస్తాయి" అని అంటున్నారు నటుడు మురళీధర్ గౌడ్. అవకాశాల కోసం పార్టీలకు వెళ్లడం, సినిమా ఆఫీసుల చుట్టూ తిరగడం తనకు ఇష్టం ఉండదని స్పష్టం చేశారు. బలగం సినిమాతో గుర్తింపు పొందిన ఆయన ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. "ఇప్పుడు నాకు మూడు ప్రాంతాలు మాత్రమే తెలుసు. ఒకటి నా ఇల్లు, రెండోది షూటింగ్ లొకేషన్, మూడోది డబ్బింగ్ రూమ్. ఈ మూడు తప్ప నాకు మరో ప్రపంచమే లేదు. చాలామంది అవకాశాల కోసం నిర్మాతలు, దర్శకులను కలవాలని సలహా ఇచ్చారు. కానీ నేను అలాంటి ప్రయత్నాలు చేయలేదు. నా పని నచ్చితే అవకాశాలు వాటంతట అవే వస్తాయని నమ్ముతాను. జూనియర్ ఎన్టీఆర్, హీరో శ్రీకాంత్‌తో పాటు పలువురు ప్రముఖులు నా నటనను మెచ్చుకోవడం జీవితంలో మరిచిపోలేని ఆనందాన్ని ఇచ్చింది" అని చెప్పారు.
అవకాశాలు వాటంతట అవే వస్తాయి
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 31, 2026, 08:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)