నటుడు ప్రిన్స్ సెసిల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాను ప్రేమించిన సాయి ప్రతిమను సోమవారం (ఆగస్టు 24) వివాహం చేసుకున్నారు. బంధుమిత్రుల సమక్షంలో న్యూజిలాండ్‌లోని ‘వానకా’ ప్రాంతంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని ప్రిన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. వారి పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి, వీటికి ‘జీవితకాలపు బంధానికి స్వాగతం’ అని క్యాప్షన్ పెట్టి లవ్ ఎమోజీలను జోడించారు. ఈ ఫొటోలు వైరల్ అవ్వడంతో నూతన వధూవరులకు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
వివాహ బంధంలోకి ప్రిన్స్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 24, 2026, 07:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)