శుక్రవారం, 14 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ఫర్జీ 2’ షూటింగ్‌లో రాశి ఖన్నా

4 గంటల క్రితం

megha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 14, 2026, 07:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌, విజయ్‌ సేతుపతి, రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ ‘ఫర్జీ 2’. తాజాగా రాశి ఖన్నా ఈ సిరీస్‌ షూటింగ్‌లో పాల్గొన్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. ఇందులో ఆమె ‘మేఘా వ్యాస్‌’ పాత్రలో నటిస్తోంది. క్యారవాన్‌ అద్దంలో నుంచి తొంగిచూస్తున్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ‘ఆల్మండ్‌ మిల్క్‌తో కూడిన క్రంచీ రెడ్‌ హాట్‌ మోచా గ్రాండే ఎవరి కోసం..?’ అనే క్యాప్షన్‌ను జత చేసింది. దీంతో ‘ఫర్జీ 2’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ‘ఫర్జీ’ తొలి సీజన్‌ 2023లో ఎనిమిది భాగాలుగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదలై ప్రేక్షకులను అలరించింది. ప్రముఖ చిత్రనిర్మాతలు రాజ్‌ అండ్‌ డీకే రూపొందించిన ఈ సిరీస్‌కు సీక్వెల్‌గా ‘ఫర్జీ 2’ తెరకెక్కుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్