అగ్ర కథానాయకుడు రజనీకాంత్ తన జీవిత ప్రయాణాన్ని ఆత్మకథ రూపంలో అభిమానులతో పంచుకోనున్నారు. తాజాగా ఈ విషయాన్ని ఆయన కుమార్తె సౌందర్య రజనీకాంత్ వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘‘నాన్నగారు తన ఆత్మకథ రాస్తున్నారు. తన జీవిత ప్రయాణాన్ని పాఠకులకు అందించడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. ఆ పుస్తకాన్ని ఆయన ఏ విధంగా రూపుదిద్దుతున్నారో నేను దగ్గరుండి చూశా. ఈ పుస్తకం పాఠకులు చాలా ఏళ్లపాటు మళ్లీ మళ్లీ చదివే పుస్తకంగా ఉంటుందని నేను నమ్ముతున్నా. యోగి పరమహంస యోగానంద రాసిన ‘ఒక యోగి ఆత్మకథ’ పుస్తకం తరతరాలకు ఎంత స్ఫూర్తినిస్తుందో, మా నాన్న రాస్తున్న తన కథ కూడా అలాగే ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మొదలుపెట్టి స్టార్‌గా ఎదిగిన ఆయన సినీ ప్రయాణంలో వ్యక్తిగత అనుభవాలు, ఎదుర్కొన్న సవాళ్లు, విజయాలు అన్నింటినీ ఇందులో రాస్తున్నారు’’ అని ఆమె అన్నారు. రజనీకాంత్ బయోపిక్ మూవీ తెరకెక్కుతుందా అనే ప్రశ్నకు ఆమె, ‘‘నాన్న జీవితాన్ని సినిమాగా తీస్తే నాకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ప్రత్యేకమైంది. అయితే అందుకు దర్శకుడు సిద్ధంగా ఉండాలి. ఏ కథకు ఏది అవసరమో తనకు తెలిసి ఉండాలి’’ అని ఆమె బదులిచ్చారు.
ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 24, 2026, 07:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)