గురువారం, 27 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

'రంభ ఊర్వశి మేనక' టైటిల్ సాంగ్‌ విడుదల

1 గంట క్రితం

song
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 27, 2026, 06:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అల్లరి నరేశ్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం 'రంభ ఊర్వశి మేనక'. ఈ సినిమా నుంచి తాజాగా టైటిల్ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది.  హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పాటను ఆవిష్కరించారు. పూర్తి ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్‌గా ఉన్న ఈ పాట లిరికల్ వీడియోను ఆదిత్య మ్యూజిక్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చగా, సురేష్ బనిశెట్టి సాహిత్యం అందించారు. గాయకులు ధనుంజయ్ సీపాన, సాహితి చాగంటి తమ గాత్రం అందించారు. చంద్రమోహన్ చింతడా రచన, దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్‌లపై రాజేష్ దండా, ప్రసాద్ నిమ్మకాయల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్