గురువారం, 27 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

IND vs SL: సోనల్ దినూష అద్భుత పోరాటం.. రెండో టెస్టు డ్రా

2 గంటల క్రితం

Sonal-Dinusha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 27, 2026, 05:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

భారత్, శ్రీలంక మధ్య కొలంబోలోని ఎస్‌ఎస్‌సీ మైదానంలో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ఫాలోఆన్ ఆడిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో సోనల్ దినూష అద్భుతమైన పోరాటం చేశాడు. 196 బంతుల్లో శతకం పూర్తి చేసి, చివరి వరకు 133 పరుగులతో వికెట్ కాపాడుకుని మ్యాచ్ ను డ్రాగా ముగించాడు. ఐదో రోజు శ్రీలంక ఏడో వికెట్‌గా కేసర నువంత 46 పరుగుల వద్ద మానవ్ సుతార్ బౌలింగ్‌లో ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ప్రభాత్ జయసూర్య 2 పరుగులకే రవీంద్ర జడేజా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. లహిరు కుమార 12 పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లో అవుటయ్యాడు. శ్రీలంక 9 వికెట్లకు 429 పరుగులు చేసిన సమయంలో మ్యాచ్‌లో ఫలితం తేలే పరిస్థితి లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్‌ను డ్రాగా ముగించాలని నిర్ణయించారు.

కొలంబో టెస్టు డ్రాగా ముగిసినప్పటికీ, గాలేలో జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 1-0తో టీమ్ ఇండియా కైవసం చేసుకుంది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో సోనల్ దినూష చేసిన 133 పరుగుల అద్భుత పోరాటం జట్టును ఓటమి నుంచి కాపాడింది. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్