గురువారం, 27 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

స్పెషల్ టెట్‌పై విజయనగరంలో ఎస్.టి.యు ధర్నా

2 గంటల క్రితం

WhatsApp Image 2026-08-27 at 5.29.58 PM.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 27, 2026, 05:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి, విజయనగరం టౌన్ : స్పెషల్ టెట్‌ నోటిఫికేషన్‌లో అవసరమైన మార్పులు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర ఎస్.టి.యు సంఘం పిలుపు మేరకు విజయనగరం కలెక్టరేట్‌ ఎదుట గురువారం ఎస్.టి.యు ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఇన్‌చార్జి డి.ఆర్.ఓ యం. అరుణ కుమారికి ఉపాధ్యాయుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. స్పెషల్ టెట్‌ను ఆన్‌లైన్‌ విధానానికి బదులుగా ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహించాలని, ఉపాధ్యాయులు బోధించే సబ్జెక్టుకు మాత్రమే సిలబస్‌ను పరిమితం చేయాలని, అలాగే అభ్యర్థులందరికీ సమానమైన ఉత్తీర్ణత మార్కులను నిర్ణయించాలని ఎస్.టి.యు నాయకులు డిమాండ్‌ చేశారు. ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయుల వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం స్పెషల్ టెట్‌ విధానంలో తగిన మార్పులు చేయాలని కోరారు.ఈ సందర్భంగా ఎస్.టి.యు జిల్లా అధ్యక్షులు వై. అప్పారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి డి. శ్యామ్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి స్పెషల్ టెట్‌ నోటిఫికేషన్‌లో అవసరమైన సవరణలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వి. గోవిందరావు, ఆర్థిక కార్యదర్శి ఎస్.ఎస్. దొర, పి. రమేశ్, సి.హెచ్. మురళి, ఈ. సంతోష్ కుమార్, వి. మల్లేశ్వరరావు తదితర రాష్ట్ర, జిల్లా నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్