నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన 'రావు బహదూర్' చిత్రం ఓటీటీలోకి వచ్చింది. జూలై 3న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా జూలై 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. వెంకటేశ్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దీపా థామస్ హీరోయిన్‌గా నటించారు. గోపాలకృష్ణ రెడ్డి చింతా, శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డిలు నిర్మాతలుగా వ్యవహరించగా, ప్రముఖ నటుడు మహేష్‌బాబు సమర్పించారు. థియేటర్లలో మిశ్రమ స్పందన పొందిన ఈ చిత్రం విడుదలైన నెల రోజులు తిరక్కముందే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఓటీటీలోకి ‘రావు బహదూర్’
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 31, 2026, 07:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)