శుక్రవారం, 14 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

శర్వానంద్‌ కొత్త సినిమా ‘జార్జ్‌ క్రిష్‌’

4 గంటల క్రితం

sarvanand
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 14, 2026, 07:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

దర్శకుడు శ్రీను వైట్ల, హీరో శర్వానంద్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న తొలి చిత్రం ‘జార్జ్‌ క్రిష్‌’. ఈ మూవీ పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్‌లో జరిగాయి. ముహూర్తపు షాట్‌కు ప్రముఖ నిర్మాత సురేశ్‌ బాబు కెమెరా స్విచాన్‌ చేయగా, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ క్లాప్‌ కొట్టారు. తొలి షాట్‌కు శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. ప్రారంభోత్సవం రోజే ఈ సినిమా జనవరి 14న విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్‌ ప్రకటించారు. ఈ మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్