బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

'స్పిరిట్' షూటింగ్ 40% పూర్తి

20 జులై, 2026

spirit
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 06:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రం 'స్పిరిట్' షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయిందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు. అమెరికాలో నిర్వహించిన తెలుగు టాలెంట్ అసోసియేషన్ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం చిత్రీకరణ వేగంగా సాగుతోందని తెలిపారు. పోలీస్ అధికారిగా ప్రభాస్ కనిపించనున్న ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రీ కథానాయికగా నటిస్తోంది. వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 2027 మార్చి 5న చిత్రాన్ని విడుదల చేయాలనే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్