యువ కథానాయకుడు శ్రీ విష్ణు, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ప్రొడక్షన్ నెం. 39. నేటి యువత జీవితంలో ఎదురయ్యే అనుభవాలు, భావోద్వేగాలు, కలలు, ఆశలు, ఆకాంక్షలు, సవాళ్లను ప్రతిబింబించే కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సన్నివేశాలు, అన్ని రకాల భావోద్వేగాలతో కూడిన ఓ సరికొత్త ప్రయాణాన్ని ఈ సినిమా ఆవిష్కరించనుంది. ఈ సినిమా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ మేకర్స్ తాజాగా ఓ చిన్న గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. హారికా సూర్యదేవర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్. నాగ వంశీ సమర్పిస్తున్నారు. సన్నీ సంజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
శ్రీవిష్ణు కొత్త సినిమా
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 31, 2026, 07:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)