తమిళ చిత్ర పరిశ్రమలో థియేటర్లలో విడుదల, ఓటీటీ మధ్య వివాదం ముదిరింది. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే సినిమాలను ఓటీటీలోకి అనుమతించాలని థియేటర్ యజమానుల సంఘం పట్టుబడుతుండగా, తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈ నిబంధనను వ్యతిరేకించింది. ఓటీటీ వేదికల ప్రాధాన్యం, ప్రేక్షకుల మారుతున్న వీక్షణ అలవాట్లను దృష్టిలో ఉంచుకుని విడుదల విషయంలో నిర్మాతలకు స్వేచ్ఛ ఉండాలని కౌన్సిల్ కోరుతోంది. ఇరు వర్గాల మధ్య పలు దఫాలు చర్చలు జరిగినా ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో సెప్టెంబర్ 1 నుంచి కొత్త తమిళ సినిమాలను థియేటర్లలో విడుదల చేయకూడదని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయించింది. దీంతో తమిళ చిత్ర పరిశ్రమలో మరోసారి థియేటర్లు–ఓటీటీ మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి.
1 నుంచి తమిళ కొత్త సినిమాల బంద్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 22, 2026, 07:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)