శనివారం, 22 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

డిజిటల్ పేమెంట్స్ రంగానికి భారీగా నిధులు

1 గంట క్రితం

pay
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 22, 2026, 08:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఐదేళ్లలో రూ.48వేల కోట్ల సమీకరణ

న్యూఢిల్లీ : భారతదేశ డిజిటల్ పేమెంట్స్ రంగం భారీగా నిధులు సమీకరించింది. గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాం ‘ట్రాక్సన్’ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. 2021 జనవరి నుంచి ఇప్పటివరకు దేశీయ పేమెంట్స్ కంపెనీలు మొత్తం 371 ఈక్విటీ ఫండింగ్ రౌండ్ల ద్వారా 5.8 బిలియన్ డాలర్ల (సుమారు రూ.48,000 కోట్లు) నిధులను సేకరించాయి. చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు సైతం డిజిటల్ చెల్లింపులను పెద్దఎత్తున ఉపయోగిస్తుండటంతో ఈ రంగానికి ఆదరణ పెరుగుతోంది. అయితే.. ఈ ఐదేళ్ల కాలంలో పెట్టుబడుల ప్రవాహం పలుమార్లు హెచ్చుతగ్గులకు లోనైంది. 2021లో పెట్టుబడులు గరిష్ట స్థాయికి చేరగా.. ఆ తర్వాత 2022 నుంచి 2024 మధ్య కాలంలో మార్కెట్ కరెక్షన్ కారణంగా సుదీర్ఘ కాలం పాటు నిధుల కొరత పరిస్థితులు నెలకొన్నాయి. మళ్లీ 2026 నాటికి ఈ రంగం కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నట్లు ట్రాక్సన్ పేర్కొంది. పెరుగుతున్న పోటీ నడుమ ఈ రంగం కొద్ది సంఖ్యలో బలమైన నిధులు కలిగిన సంస్థల వైపు కేంద్రీకృతమవుతోంది. ఈ కాలంలో మొత్తం 8 కంపెనీలు ఐపిఒల ద్వారా స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించగా.. మరో 25 కంపెనీలు విలీనాలు, కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేసుకున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్