హాలీవుడ్ స్థాయి మేకింగ్‌తో తెరకెక్కిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ 'ఎం4ఎం' బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా 60 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. జూలై 18న కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ఉన్న 'సినీ లాంజ్'లో ఈ వేడుకలు వైభవంగా జరిగాయి. చిత్ర దర్శకుడు, నిర్మాత మోహన్ వడ్లపట్ల, హీరోయిన్ జో శర్మతో పాటు అభిమానులు, కమ్యూనిటీ నాయకులు, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'ఎం4ఎం' ఫ్రాంచైజీలో తదుపరి చిత్రంగా 'ఎం4ఎం-2'ను మోహన్ వడ్లపట్ల, జో శర్మ అధికారికంగా ప్రకటించారు. తొలి భాగాన్ని మించే స్థాయిలో ఊహించని మలుపులు, ఉత్కంఠభరిత కథనంతో ఈ సీక్వెల్‌ను రూపొందించనున్నట్లు వెల్లడించారు.
‘M4M’ 2 ప్రకటన వచ్చేసింది!
20 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 20, 2026, 09:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)