సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

24న ‘ది ప్యారడైజ్‌’

1 గంట క్రితం

nani
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 08:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నాని–శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్‌’కు సెన్సార్‌ బోర్డు ‘ఎ’ సర్టిఫికెట్‌ జారీ చేసింది. సుమారు 2 గంటల 49 నిమిషాల రన్‌టైమ్‌తో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 24న థియేటర్లలో విడుదల కానుంది. సెప్టెంబర్‌ 23న కొన్ని ప్రాంతాల్లో పెయిడ్‌ ప్రీమియర్స్‌ నిర్వహించనున్నారు. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్‌ 23న నిర్వహించే పెయిడ్‌ ప్రీమియర్స్‌కు టికెట్‌ ధరను ₹500గా నిర్ణయించేందుకు అనుమతించింది. సెప్టెంబర్‌ 24 నుంచి అక్టోబర్‌ 3 వరకు సాధారణ టికెట్‌ ధరలపై అదనపు పెంపునకు కూడా అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉండగా, నాని అభిమానుల సమావేశం నిర్వహించి సినిమా విడుదల, ప్రమోషన్‌ కార్యక్రమాలపై చర్చించారు. నాని–శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘దసరా’ తర్వాత రూపొందుతున్న చిత్రం కావడంతో ‘ది ప్యారడైజ్‌’పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్