సోమవారం, 03 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

శూర్పనఖ పాత్రే సవాల్‌

3 గంటల క్రితం

surpana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 03, 2026, 10:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‘శూర్పనఖ పాత్రను అర్థం చేసుకోవడమే చాలా కష్టం. అందుకే ఆ పాత్రలో నటించడానికి అంగీకరించాను’ అని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. ఇటీవల విడుదలైన ‘రామాయణ’ ట్రైలర్‌లో శూర్పనఖ పాత్రలో ఆమె నటిస్తున్న విషయం వెల్లడైంది. ఈ పాత్రను ఎంచుకోవడంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె స్పందించారు. సవాల్‌తో కూడిన పాత్రల్లో నటించడం తనకు ఎంతో ఉత్సాహాన్నిస్తుందని రకుల్ చెప్పారు. ఇప్పటివరకు శూర్పనఖను ఒకే కోణంలో గుర్తుపెట్టుకున్నారని, కానీ ఆమె కథలో ఎన్నో కోణాలున్నాయని అన్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు శూర్పణఖను కొత్త దృక్పథంతో చూస్తారని పేర్కొన్నారు. నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో తొలి భాగం ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల కానుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్