శనివారం, 22 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సెప్టెంబర్‌ 3న ‘రోమాంచకం’

3 గంటల క్రితం

love
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 22, 2026, 08:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సందీప్‌రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్‌ బ్యానర్‌పై ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మిస్తున్న ‘రోమాంచకం’ చిత్రానికి వేణుగోపాల్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్‌ ప్రభాస్‌, అనంతిక సనిల్‌ కుమార్‌ జంటగా నటిస్తున్న ఈ ప్రేమ, హాస్యం, ఉత్కంఠభరిత యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ సెప్టెంబర్‌ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా‌ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు వేణుగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ, కథ నచ్చడంతో సందీప్‌రెడ్డి వంగా, ప్రణయ్‌ రెడ్డి వంగా వెంటనే సినిమాను నిర్మించేందుకు ముందుకొచ్చారని, సందీప్‌ తన పనిలో జోక్యం చేసుకోకుండా పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని తెలిపారు. నిర్మాత ప్రణయ్‌ రెడ్డి వంగా మాట్లాడుతూ, కథలోని హాస్యం, పాత్రలు ఆకట్టుకోవడంతో సినిమాను నిర్మించామని, నటీనటులతో మూడు నెలల పాటు రిహార్సల్స్‌ చేయించి మంచి నటన రాబట్టామని చెప్పారు. హీరో సుమంత్‌ ప్రభాస్‌ మాట్లాడుతూ, భద్రకాళీ పిక్చర్స్‌ వంటి బ్యానర్‌లో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని, దర్శకుడు ఆరు నెలల పాటు రిహార్సల్స్‌ చేయించారని, సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని చెప్పారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్